APPSC Forest Range Officer Posts Recruitment Notification Vacancies Important Dates


APPSC Forest Range Officer Posts Recruitment Notification Vacancies Important Dates

నోటిఫికేషన్‌ నెంబర్‌ 21/2022 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ అక్టోబర్‌ 17న తెలిపారు.

To Get FREE New Admissions and Job Alerts Directly on WhatsApp :: Click here

Follow us on :: Twitter|| Facebook || Telegram

కాగా, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ పోస్టులకు నవంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Also Read :: APPSC Recruitment COMPUTER DRAUGHTSMAN Posts Notification

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుతకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. బ్యాచిలర్స్ డిగ్రీ(అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్‌, జువాలజీ) పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

APPSC Forest Range Officer Posts Recruitment

ముఖ్యమైన విషయాలు..

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులను క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్-1, పేపర్-2, పేపర్-3, పేపర్-4 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు చెల్లిస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 05-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
  • పరీక్షా ఫీజును 04-12-2022లోపు చెల్లించాల్సి ఉంటుంది.

Click Here to Download Complete Notification

For Official website Click here

APPSC Draft

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *